Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:00 AM

గంగుల పూలమ్మ–శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థం ముగ్గుల పోటీలు

24-01-2026 110 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలం నీర్నంల గ్రామంలో గంగుల పూలమ్మ–శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థం ముగ్గుల పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 25వ తేదీ మధ్యాహ్నం ఒకటి గంటలకు గ్రామపంచాయతీ పరిధిలో ఈ పోటీలు జరగనున్నాయి.ఈ ముగ్గుల పోటీలకు ప్రథమ బహుమతిగా ఐదు వేల పదహారు రూపాయలు, ద్వితీయ బహుమతిగా మూడు వేల పదహారు రూపాయలు, తృతీయ బహుమతిగా వెయ్యి ఐదు వందల పదహారు రూపాయలను అందజేయనున్నట్లు తెలిపారు. పోటీలో పాల్గొనే వారు తమకు అవసరమైన రంగులను స్వయంగా తీసుకురావాల్సి ఉంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.పోటీల్లో విజేతలైన వారికి గ్రామ ప్రాథమిక పాఠశాలలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ బహుమతులను గ్రామ మాజీ సర్పంచ్ గంగుల వెంకటరెడ్డి, శ్రీలత దంపతులు అందజేయనున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పత్రికా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Sthanikam

గంగుల పూలమ్మ–శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థం ముగ్గుల పోటీలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News