Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:49 PM

గందమల్ల విద్యార్థుల ఆరోపణలపై విచారణ

గందమల్ల విద్యార్థుల ఆరోపణలపై విచారణ

గందమల్ల విద్యార్థుల ఆరోపణలపై విచారణ
22-01-2026 128 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పాఠశాలలో వివరాలు సేకరించిన సామాజిక కార్యకర్తలు

స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గందమల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నాలుగు రోజుల క్రితం 1098కు ఫోన్ చేసి చేసిన ఫిర్యాదులపై సామాజిక కార్యకర్తలు స్పందించారు. బాలల హక్కుల పరిరక్షణ వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్, నేషనల్ హ్యుమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ ఇంతియాజ్ గురువారం గందమల్ల గ్రామాన్ని సందర్శించి పాఠశాలలో వివరాలు సేకరించారు.ఈ సందర్భంగా వారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశమై విద్యార్థులు చేసిన ఆరోపణలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భద్రత, హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై సమగ్ర విచారణ అవసరమని వారు అభిప్రాయపడ్డారు.సేకరించిన పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారులకు వ్రాతపూర్వకంగా అందజేసి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు వారు తెలిపారు. విద్యార్థుల సమస్యలను తేలికగా తీసుకోకుండా పారదర్శకంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Sthanikam

గందమల్ల విద్యార్థుల ఆరోపణలపై విచారణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News