Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:06 PM

ఘనంగా వివిధ రకాల పూలతో సప్తవర్ణ శోభితంగా శ్రీవారి పుష్పయాగం

12-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి వివిధ రకాల పూలతో

సప్తవర్ణ శోభితంగా శ్రీవారి పుష్పయాగం.

ఆనంద్ బాగ్ ఎక్స్ రోడ్ లోని దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయంలో గత డిసెంబర్ 16 నుండి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవములలో భాగంగా సోమవారం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని ఆలయంలోని వేదికపై ఉంచి సంపంగి, జాజి, చామంతి, మల్లేలు, కనకాంబరాలు, గన్నేరు, పొగడ, గులాబీలు, తామెరలు, కలువ, మొగలి, నిత్యమల్లి, మనోరంజితం, పారిజాతం వివిధ రకాల సుగంధభరితమైన పూలతో

సప్తవర్ణ శోభితంగా, అత్యంత వైభవంగా పుష్పాభిషేకం నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణ చార్యులు, అర్చకులు తులసి వెంకట రమణ చార్యులు. రంగు రంగుల పుష్పాల మధ్య స్వామి అమ్మవార్ల వైభవం చూసి తరించిపోయామని, ఇలాంటి వైభవం ఈ ఆలయంలో తప్ప ఏ ఆలయంలో కూడా చూడలేదని భక్తులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వేంకట రమణ చార్యులు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించే ఒక వైభవమైన ఉత్సవం శ్రీ పుష్పయాగం. దీనిని ప్రకృతి వైపరీత్యాల నుండి భూమిని రక్షించడానికి, లోకకల్యాణాన్ని కాంక్షించి, వేంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవిలకు అష్టోత్తర శత పుష్పాలతో, వివిధ రకాల పూలతో పుష్పాభిషేకం నిర్వహించామని అన్నారు. అనంతరం స్వామివారి వివిధ రకాల అద్భుతాలంకరణలో ఒక భక్తుడు రూపొందించిన క్యాలెండర్ ను ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించి, దర్శనానికి వచ్చిన భక్తులకు ఉచితంగా పంపిణీ చేశామని ఆలయ ఈఓ ఏబి రవీందర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా వివిధ రకాల పూలతో సప్తవర్ణ శోభితంగా శ్రీవారి పుష్పయాగం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News