Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:54 AM

ఘనంగా ఎన్టీఆర్ 30వచిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకు వర్ధంతి వేడుకలు

ఘనంగా ఎన్టీఆర్ 30వచిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకు వర్ధంతి వేడుకలు

ఘనంగా ఎన్టీఆర్ 30వచిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకు వర్ధంతి వేడుకలు
January 18, 2026 10:36 AM 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న నర్సింహ గౌడ్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ అని అన్నారు. పేదలు, మహిళలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొన్నారు.కిలో రెండు రూపాయల బియ్యం పథకం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతులకు విద్యుత్ సరఫరా, మండల వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, సాగు–తాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర రాజకీయాల దిశనే మార్చిన నాయకుడు ఎన్టీఆర్ అని ఆమె అన్నారు.ఎన్టీఆర్ ప్రజాజీవితంలో చేసిన సేవలు, రాజకీయాల్లో తీసుకువచ్చిన సంస్కరణలను ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు. రాజకీయాలను సేవగా మలిచిన మహనీయుడి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న నర్సింహ గౌడ్‌ను టీడీపీ నాయకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు బత్తుల వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సీమ లింగయ్య, సీనియర్ నాయకులు బొడిగె విజయ్ కుమార్ గౌడ్, మిద్దెల యాదగిరి, మాజీ సింగిల్ విండో చైర్మన్ అంతటి శ్రీనివాస్ గౌడ్, రత్నం నర్సింహ, జవాజి మత్స్యగిరి, మిద్దెల రామలింగయ్య, అంబాల మారయ్య, బొడిగె యాదయ్య, గోపగోని భాషా, బడే అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News