Sthanikam - Truth Matters
Logo

ఘనంగా శ్రీ రామ్ యువసేన ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

Updated : 19 Feb 2026 11:07 IST
As Preferred Source 1 min read
ఘనంగా శ్రీ రామ్ యువసేన ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో శ్రీ రామ్ యువసేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.జయంతి సందర్భంగా గ్రామంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై శివాజీ మహారాజ్ చిత్రపటాన్ని ప్రతిష్టించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం యువసేన సభ్యులు శివాజీ మహారాజ్ జీవిత విశేషాలను, ఆయన దేశభక్తి, పరాక్రమం, ధైర్యసాహసాలను వివరించారు. దేశ స్వాభిమానం కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ మహారాజ్ స్వరాజ్య సాధన కోసం అనేక యుద్ధాలు చేసి ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపారు. ధైర్యం, పరిపాలనా నైపుణ్యం, దేశభక్తి కలగలిపిన మహానాయకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న, పాలకవర్గ సభ్యులు, శ్రీరామ్ యువసేన నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా శ్రీ రామ్ యువసేన ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

Article Image

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో శ్రీ రామ్ యువసేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.జయంతి సందర్భంగా గ్రామంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై శివాజీ మహారాజ్ చిత్రపటాన్ని ప్రతిష్టించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం యువసేన సభ్యులు శివాజీ మహారాజ్ జీవిత విశేషాలను, ఆయన దేశభక్తి, పరాక్రమం, ధైర్యసాహసాలను వివరించారు. దేశ స్వాభిమానం కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ మహారాజ్ స్వరాజ్య సాధన కోసం అనేక యుద్ధాలు చేసి ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపారు. ధైర్యం, పరిపాలనా నైపుణ్యం, దేశభక్తి కలగలిపిన మహానాయకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న, పాలకవర్గ సభ్యులు, శ్రీరామ్ యువసేన నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news