Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:52 PM

ఘనంగా శ్రీ దేవల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

03-03-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఘనంగా శ్రీ దేవల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

కోదాడ పట్టణ పరిధిలోని మూడో వార్డు తమ్మరబండపాలెం గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కళ్యాణ మహోత్సవం వేద పండితుల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ముడుంబ వేణుగోపాల చార్యులు అధ్యక్షతన కళ్యాణ మహోత్సవ వేలాది మంది భక్తుల నడుమ ఘనంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ సుమారు 600 ఏళ్ల క్రితం స్వయంభువుగా వెలసిన ఈ స్వామివారి విశిష్టత ప్రత్యేకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని, ఈ ఏడాది కూడా భక్తుల సమక్షంలో శ్రీవారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు వెల్లడించారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారని తెలిపారు. భక్తుల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. స్వామివారిని దర్శించి మొక్కులు పెట్టుకున్న వారికి వరప్రసాదం లభిస్తుందనే విశ్వాసం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా శ్రీ దేవల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News