Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:56 AM

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు: జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణ

28-01-2026 136 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి స్థానికం ప్రధాన ప్రతినిధి

భువనగిరి పట్టణంలోని బీచ్ మహళ్ళా ప్రభుత్వ పాఠశాలలో “మరో గ్రంథాలయ ఉద్యమం బస్సు యాత్ర” గోడ ప్రతులను జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనం మనసుకు ఆరోగ్యకరమైన వ్యాయామమని అన్నారు. బడి ఈడు పిల్లలకు ఇవ్వాల్సిన ఉత్తమ బహుమతి ఒక మంచి పుస్తకమేనని పేర్కొన్నారు.

సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పిన “చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం మాత్రం కొనుక్కో” అన్న సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు.

మరో గ్రంథాలయ ఉద్యమం బస్సు యాత్ర నిర్వాహకుడు కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలు, పాఠశాలల్లో గ్రంథాలయాలను బలోపేతం చేయాలని, ప్రతి పాఠశాలలో రోజుకు ఒక పిరియడ్ పుస్తక పఠనానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నాగవర్ధన్ రెడ్డి, తెలంగాణ సాహితీ సంస్థ జిల్లా అధ్యక్షులు జిట్టా భాస్కర్ రెడ్డి, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్, దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేడి భాస్కర్, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు: జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణ

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News