Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 09:06 AM

గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం: జిల్లా కలెక్టర్ హనుమంతరావు

గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం: జిల్లా కలెక్టర్ హనుమంతరావు

గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం: జిల్లా కలెక్టర్ హనుమంతరావు
January 19, 2026 06:06 PM 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

గ్రామాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్‌లో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు గ్రామ పంచాయతీ పాలన, విధులు, అభివృద్ధి అంశాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ కిషోర్ రెడ్డి, డైరెక్టర్ విహారి, జడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఎంఆర్‌ఓ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే సర్పంచులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. సర్పంచులు సమర్థవంతంగా పనిచేస్తేనే గ్రామాలకు మంచి గుర్తింపు వస్తుందన్నారు. పంచాయతీ రాజ్ చట్టంలో సర్పంచులకు కల్పించిన అధికారాలు, విధులపై శిక్షణలో భాగంగా సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు.

గ్రామాల్లో శానిటేషన్ నిర్వహణ, తాగునీటి ఎద్దడి లేకుండా చూడడం వంటి ప్రధాన అంశాల్లో సర్పంచులు చురుకుగా వ్యవహరించాలని తెలిపారు. ప్రతి గ్రామం శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీ రాజ్ చట్టంలోని గ్రామ పాలన విధులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఆర్థిక నిర్వహణ, గ్రామాభివృద్ధి ప్రణాళికలు, ఆదర్శ గ్రామపంచాయతీల నిర్మాణం వంటి అంశాలపై సర్పంచుల బాధ్యతలను ఈ శిక్షణ ద్వారా వివరించనున్నట్లు తెలిపారు.

అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు (మోరల్ స్కిల్స్) వంటి అంశాలపై కూడా సర్పంచులు అవగాహన కలిగి ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీవోలు, నూతన సర్పంచులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News