Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:09 PM

గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

17-01-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం తన ఛాంబర్‌లో అన్ని శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించిన ఆయన, ఆయా శాఖలు చేపట్టాల్సిన బాధ్యతలను సమీక్షించారు. ఈ సందర్భంగా వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో, వేదిక ఏర్పాటు, వీఐపీలు, అధికారులు, ప్రజలకు అనుకూలంగా సీటింగ్ వ్యవస్థను పక్కాగా రూపొందించాలని తెలిపారు. ప్రొటోకాల్‌ను కచ్చితంగా అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని, జాతీయ భావనను పెంపొందించేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతంగా సాగేలా చూడాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పేర్కొన్నారు.ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, భువనగిరి ఆర్డీవో కృష్ణా రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి జగన్మోహన్ ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News