Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:39 PM

ఎయిడ్స్‌పై అవగాహనకు వెల్లంకి గ్రామంలో ఆరోగ్య శిబిరం

28-01-2026 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామ పంచాయతీ పరిధిలో ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. నల్లగొండ జిల్లా వైఆర్జీ కేర్ లింక్ వర్కర్ స్కీమ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గ్రామస్థుల నుంచి మంచి స్పందన పొందింది.ఈ సందర్భంగా జోనల్ పర్యవేక్షకురాలు బాలజ్యోతి మాట్లాడుతూ, హెచ్ఐవీ ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, రక్తం ద్వారా మాత్రమే వ్యాపించే వ్యాధి అని స్పష్టంగా తెలిపారు. హెచ్ఐవీ ఉన్న వారితో కలిసి జీవించడం, చేతులు కలపడం, వారు వాడిన మరుగుదొడ్లు ఉపయోగించడం, దోమల కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపించదని ఆమె వివరించారు.పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒకసారి రక్తపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తిస్తే ఆరోగ్యంగా జీవించవచ్చని చెప్పారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, కలుషిత సూదులు–సిరంజీలు, కలుషిత రక్త మార్పిడి, హెచ్ఐవీ సోకిన తల్లి నుంచి శిశువుకుఈ నాలుగు మార్గాల ద్వారానే హెచ్ఐవీ వ్యాప్తి జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, రామన్నపేట ఏరియా ఆసుపత్రి కౌన్సిలర్, లింక్ వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు రక్తపరీక్షలు చేయించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ఎయిడ్స్‌పై అవగాహనకు వెల్లంకి గ్రామంలో ఆరోగ్య శిబిరం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News