Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:16 AM

ఎన్నికల వేళే కాంగ్రెస్‌కు అభివృద్ధి గుర్తు – చిరుమర్తి లింగయ్య

10-01-2026 127 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ జిల్లా – చిట్యాల

చిట్యాల పట్టణ కేంద్రంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఎన్నికలు సమీపిస్తేనే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి గుర్తుకు వస్తుందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల వేళ మాత్రమే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా మున్సిపాలిటీకి చేసింది శూన్యమని, పట్టణ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు.

స్థానిక ఎమ్మెల్యే ఈ రెండేళ్ల కాలంలో పట్టణానికి ఒక్క పైసా నిధులు కూడా తీసుకురాలేదని ఆరోపించారు. బిఆర్ఎస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.25 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు. అప్పట్లో మంజూరు చేసిన పనులకు తాజాగా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు చేయడమేంటని ప్రశ్నించారు.

రెండేళ్లుగా చేయని శంకుస్థాపనలు ఒక్కరోజులో చేయడంలో అంతర్యం ఏమిటో పట్టణ ప్రజలు గమనించాలని కోరారు. ఇవన్నీ ఎన్నికల కోసమే చేస్తున్న డ్రామాలేనని వ్యాఖ్యానించారు. చిట్యాల పట్టణానికి ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీలు నిజంగా ఎన్ని నిధులు మంజూరు చేశారో ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.మేము మంజూరు చేసిన పనులకుశంకుస్థాపనలు చేయడం కాదు, కొత్తగా పనులు మంజూరు చేసి నిజమైన అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. అధికార బలంతో మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, డబ్బు సంచులు, అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి సిద్ధమైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Sthanikam

ఎన్నికల వేళే కాంగ్రెస్‌కు అభివృద్ధి గుర్తు – చిరుమర్తి లింగయ్య

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News