Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:36 PM

ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ – త్వరిత న్యాయానికి మంచి అవకాశం

24-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఈ నెల 28వ తేదీ (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఈ లోక్ అదాలత్‌లో వివిధ రకాల పెండింగ్ కేసులను రాజీ మార్గం ద్వారా సులభంగా,త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం కల్పించబడుతుంది.కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇరు పక్షాల సమ్మతితో వివాదాలను పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ఖర్చు ఆదా అవుతుంది. ముఖ్యంగా సివిల్, మోటార్ వాహన ప్రమాదాలు, బ్యాంకు రుణాలు, చెక్కు బౌన్స్ కేసులు వంటి అంశాలలో లోక్ అదాలత్ ద్వారా త్వరగా న్యాయం పొందవచ్చు.సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగారెడ్డి,జహీరాబాద్, జోగిపేట్, నారాయణఖేడ్ కోర్టులలో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ప్రజలు, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కేసులను పరస్పర రాజీతో పరిష్కరించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం ద్వారా సత్వర న్యాయం, సమన్యాయం అందించడమే లక్ష్యంగా ఉండగా, సంబంధిత పక్షాలు ముందుకు వచ్చి సహకరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కోరింది.

Sthanikam

ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ – త్వరిత న్యాయానికి మంచి అవకాశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News