Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:18 PM

ఎన్టీఆర్ అనే పేరే ఒక సంచలనం.మాన్వి దేవేంద్రప్ప

18-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

ఆదోని పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును స్మరిస్తూ ఆదివారం ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదోనిలోని మాన్వి దేవేంద్రప్ప కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ, కురుమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు వినగానే అది ఒక సంచలనమని వ్యాఖ్యానించారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం ఎన్టీఆర్‌కే సాధ్యమైందని గుర్తు చేశారు.నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్‌ను మించిన వ్యక్తి లేడని, రాబోడని స్పష్టం చేశారు.బడుగు, బలహీన వర్గాలను శాసనసభల వరకు తీసుకెళ్లిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం పథకంతో సంక్షేమ పాలనకు బాటలు వేసిన నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. ఆయన మరణానంతరం పార్టీ కష్టకాలంలో చంద్రబాబు నాయకత్వ బాధ్యతలు భుజాన వేసుకుని, పార్టీని మెట్టుమెట్టుకు తీసుకువచ్చారని అన్నారు.దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీలో కోటి సభ్యత్వాలు నమోదవడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వాల నమోదులో రికార్డు సృష్టించామని, కార్యకర్తల జీవితానికి భరోసా ఇచ్చే విధంగా ఈ సభ్యత్వ వ్యవస్థ ఉందన్నారు. ఇవన్నీ ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన ఫలితమేనని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు.

Sthanikam

ఎన్టీఆర్ అనే పేరే ఒక సంచలనం.మాన్వి దేవేంద్రప్ప

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News