Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 03:25 PM

ఎన్టీఆర్ 30వ వర్ధంతి: కూసుమంచిలో ఘన నివాళులు

18-01-2026 122 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కూసుమంచి స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా కూసుమంచి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు మందపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ… సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమానికి ఎన్టీఆర్ అనేక విప్లవాత్మక పథకాలు అమలు చేశారని కొనియాడారు. పేదల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలగాటి రామనాథం, జిల్లా నాయకులు డాక్టర్ ఇంటూరి నాగరాజు చౌదరి, మండల ఉపాధ్యక్షుడు ఆడప్ప శివ, తెలుగు యువత అధ్యక్షుడు ఉప్పల ఉదయ్, రైతు సంఘం అధ్యక్షుడు తాళ్లూరి భాస్కరరావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోవింద ఎల్లయ్య, మండల బీసీ సెల్ అధ్యక్షుడు మల్లబోయిన పిట్టయ్యతో పాటు పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్టీఆర్ 30వ వర్ధంతి: కూసుమంచిలో ఘన నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News