Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:37 AM

ఎన్‌జి కళాశాలలో సామాజిక విప్లవకారుల జయంతులు

13-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సోమవారం సామాజిక విప్లవకారుల జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్టాఫ్ క్లబ్, ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా ఫులే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ జయంతులను వైభవంగా జరిపారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైస్ ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్ మాట్లాడుతూ—ఈ మహనీయులు కేవలం ఒక వర్గానికో, కులానికో పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయులని కొనియాడారు. అణగారిన వర్గాలు, మహిళలకు విద్యను అందించడంలో ఫులే చేసిన కృషి అపారమని గుర్తుచేశారు.

రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులను కాపాడుకుంటూ, అంబేద్కర్ సూచించిన “శిక్షణ, సంఘటన, పోరాటం” మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణలో, అణగారిన వర్గాల రాజకీయ సాధికారతలో బాబు జగజ్జీవన్ రామ్ పోషించిన పాత్రను స్మరించుకున్నారు.

పరీక్షల నియంత్రణాధికారి డా. టి. మునిస్వామి మాట్లాడుతూ—చదువుతోనే సాధికారత సాధ్యమని నమ్మిన ఈ మహనీయుల ఆలోచనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో స్టాఫ్ క్లబ్ కార్యదర్శి సిహెచ్. సుధాకర్, విద్యాత్మిక సమన్వయకర్త బత్తిని నాగరాజు, తెలుగుశాఖ అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, మహిళా సాధికారికత విభాగం అధ్యక్షులు డా. జి. భాగ్యలక్ష్మి, రాజనీతి శాస్త్ర విభాగం అధ్యక్షులు డా. ఎ. మల్లేశం, అధ్యాపకులు డా. భట్టు కిరీటం, డా. అనిల్ బొజ్జ, డా. అనిల్ అబ్రహం, కోటయ్య, శంకర్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్‌జి కళాశాలలో సామాజిక విప్లవకారుల జయంతులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News