Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:52 PM

ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరాల్లో సేవా స్పూర్తి వెల్లువ

23-01-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

దోరేపల్లి, పగిడిమర్రి గ్రామాల్లో జరుగుతున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శీతాకాల సమావేశ శిబిరాల్లో మూడవ రోజు సేవా కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగాయి. మేరా యువ భారత్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అలాగే జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) ఎన్ఎస్ఎస్ యూనిట్–వన్ ఆధ్వర్యంలో దోరేపల్లిలో, యూనిట్–సిక్స్ ఆధ్వర్యంలో పగిడిమర్రిలో నిర్వహిస్తున్న శిబిరాలను ఎంపీడీవో వేద రక్షిత సందర్శించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ అంతటి శ్రీనివాసులు, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మునిస్వామి, టీఎస్కెసి కోఆర్డినేటర్ అనిల్ అబ్రహం, ఫిజికల్ డైరెక్టర్ అదేమల్లేశం, డాక్టర్ అంకుష్, మేరా యువ భారత్ నల్గొండ స్టాఫ్ కొండా నాయక్‌తో పాటు కళాశాల ఉపన్యాస బృందం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో వేద రక్షిత మాట్లాడుతూ గత మూడు రోజులుగా విద్యార్థులు చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని అన్నారు. సేవాభావం ద్వారా సామాజిక అవగాహన పెరుగుతుందని, ప్రజలతో మమేకమై వారి సమస్యలను అర్థం చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు.

వైస్ ప్రిన్సిపాల్ అంతటి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరాలు గ్రామీణ సమస్యల పరిష్కారానికి దోహదపడతాయని తెలిపారు. ఆరోగ్యం, అక్షరాస్యత పెంపొందించడంతో పాటు సామాజిక దురాచారాలు, మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్–వన్ ప్రోగ్రాం ఆఫీసర్ నర్సింగ్ కోటయ్య, యూనిట్–సిక్స్ ప్రోగ్రాం ఆఫీసర్ కంబాలపల్లి శివరాణి, డాక్టర్ అంకుష్, దోరేపల్లి గ్రామ యువకుడు రాజశేఖర్, పగిడిమర్రి గ్రామ సర్పంచ్ నాగమణి సైదులు, పగిడిమర్రి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రామకృష్ణమ్మ, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు జగాల్ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి అంజయ్య, ఎస్ఎంసీ చైర్మన్ రేణుక, మాజీ సర్పంచులు నర్సిరెడ్డి, రవీందర్, మాజీ వార్డు సభ్యులు సత్తయ్య, వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్, గ్రామ ప్రజలు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరాల్లో సేవా స్పూర్తి వెల్లువ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News