Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:27 AM

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో అగ్రస్థానం లక్ష్యంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ

08-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ర్యాంకింగ్ మెరుగుదలకు అధ్యాపకుల పాత్ర కీలకం: వైస్ ఛాన్సలర్ ఘంటా చక్రపాణి

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

హైదరాబాద్, జనవరి 8: నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్)లో ఓపెన్ యూనివర్సిటీ కేటగిరిలో అగ్రస్థానంలో నిలవడమే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లక్ష్యమని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ (సికా) ఆధ్వర్యంలో గురువారం అధ్యాపకుల కోసం నిర్వహించిన “ఎన్‌ఐఆర్‌ఎఫ్: అవేర్‌నెస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్” వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ విశ్వవిద్యాలయ ప్రతిష్టను పెంచడమే కాకుండా సంస్థ ఖ్యాతిని జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తుందని అన్నారు. సమిష్టి కృషితో ఉన్నత ర్యాంకును సాధించవచ్చన్న విశ్వాసం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ స్థితిని మెరుగుపరచడంలో పరిశోధన కీలకమని పేర్కొంటూ, అధ్యాపకులు నాణ్యమైన పరిశోధనలపై దృష్టి సారించాలని సూచించారు.

వర్క్‌షాప్‌లో రిసోర్స్ పర్సన్‌గా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్వాలిటీ అక్రిడిటేషన్స్ సీఈఓ డాక్టర్ టి. రవీందర్ రెడ్డి పాల్గొని, ఉన్నత ర్యాంకులు సాధించడానికి విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా ఎలా ప్రదర్శించాలో వివరించారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ కీలక పారామీటర్లు, విశ్వవిద్యాలయ బలాలను ప్రతిబింబించే విధానాలపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా, సంస్థ పరంగా సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి మాట్లాడుతూ, పరిశోధన సామర్థ్యాల బలోపేతమే ర్యాంకింగ్‌పై గణనీయ ప్రభావం చూపుతుందని అన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్. విజయ కృష్ణా రెడ్డి సమష్టి కృషితో విశ్వవిద్యాలయం ఉన్నత స్థాయికి చేరుకోగలదని పేర్కొన్నారు. సికా డైరెక్టర్ ప్రొఫెసర్ కె. శ్రీదేవి సంస్థాగత అభివృద్ధిలో ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ కీలకమని, కచ్చితమైన డేటా సమర్పణ కోసం ఉపాధ్యాయ క్రెడిట్‌ల అప్‌లోడ్ ప్రక్రియను వివరించారు.

Sthanikam

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో అగ్రస్థానం లక్ష్యంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News