Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:06 PM

ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా కళ్యాణ పత్రిక జాతర గోడపత్రిక ఆవిష్కరణ

14-02-2026 220 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పెద్దకాపర్తిలో కళ్యాణ మహోత్సవాల సందడి ప్రారంభం

చిట్యాల మండలం పరిధిలోని పెద్దకాపర్తి గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. శ్రీ భూ సమేత తిరుమలనాద స్వామి వారి కళ్యాణ మహోత్సవాలకు తొలి అడుగుగా కళ్యాణ పత్రికను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కు అందజేసి, జాతర గోడ పత్రికను ఘనంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెద్దకాపర్తి గ్రామ జాతర ప్రాంతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తుల ఐక్యత, భక్తిశ్రద్ధలతో జాతర మరింత వైభవంగా జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం, ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, ఏర్పుల కుర్రు యాదయ్య, సాగర్ల నాగరాజు, నవ్యశ్రీ, ఆనగంటి నరేష్, పూజ, మర్రి హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవస్థాన డైరెక్టర్లు ఏర్పుల యాదమ్మ, నరసింహ, జిల్లా నరసింహ, ఎద్దుల అజిత్ రెడ్డి, మాజీ చైర్మన్ తెలుసూరి సైదులు, మాజీ ఉపసర్పంచ్ నూతి వెంకటేశం, సత్యశ్రీ గుజ్జర్ యాదగిరి, రాసి మల్ల జానయ్య, భైరవని బిక్షం, బుంగపాట్ల తిమ్మయ్య, శిరస్సు ఇదయ్య తదితరులు హాజరయ్యారు.

గ్రామంలో కళ్యాణ మహోత్సవాల సందడి ప్రారంభమవడంతో భక్తుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. జాతర ఏర్పాట్లను నిర్వాహకులు వేగవంతం చేస్తున్నారు.

Sthanikam

ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా కళ్యాణ పత్రిక జాతర గోడపత్రిక ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News