Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:47 PM

ఏసీబీ సోదాల్లో సంచలనాల వెల్లువ

ఏసీబీ సోదాల్లో సంచలనాల వెల్లువ

ఏసీబీ సోదాల్లో సంచలనాల వెల్లువ
22-01-2026 190 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హనుమకొండ అదనపు కలెక్టర్ ఇంట్లో రూ.100 కోట్ల అక్రమాస్తుల ఆనవాళ్లు

హనుమకొండ, స్థానికం ప్రధాన ప్రతినిధి

హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి ఇంట్లో జరిగిన అవినీతి నిరోధక శాఖ సోదాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి ఏసీబీ బృందాలు హైదరాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ సహా పలు ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించాయి.

సోదాల్లో రూ.100 కోట్ల వరకు అక్రమాస్తుల ఆనవాళ్లు లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అదనపు కలెక్టర్‌కు సంబంధించిన రెండు అధునాతన విల్లాలు, పది ప్లాట్లు, 14 ఎకరాల వ్యవసాయ భూమి, సుమారు రూ.50 లక్షల బ్యాంక్‌ నిల్వలు, మరికొన్ని బినామీ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

స్వాధీనం చేసుకున్న పత్రాలు, లావాదేవీల ఆధారంగా అధికారులు లోతైన విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటన అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Sthanikam

ఏసీబీ సోదాల్లో సంచలనాల వెల్లువ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News