Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:27 AM

ఏళ్ల నాటి సమస్యలకు చెక్… న్యాల్కల్ పీహెచ్‌సీలో రూ.16 లక్షల అభివృద్ధి పనులు పూర్తి

07-02-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)లో ఏళ్లుగా ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలకు పరిష్కారం లభించింది.రూ.16 లక్షల CCR నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.పీహెచ్‌సీలో దీర్ఘకాలంగా ఉన్న మరుగుదొడ్ల సమస్య,శిథిలావస్థలో ఉన్న పైకప్పు,తాగునీటి సౌకర్యం లేకపోవడం,సమావేశ భవనం కొరత వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఈ పనులు చేపట్టారు.ఉన్నతాధికారుల స్పందనతో మరుగుదొడ్ల మరమ్మతులు,పైకప్పు పునరుద్ధరణ,తాగునీటి సౌకర్యం కల్పించడం,సమావేశ భవనం నిర్మాణం పూర్తయ్యాయి.ఈ అభివృద్ధి పనులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి(DMHO)శుక్రవారం ప్రారంభించారు .దీంతో పీహెచ్‌సీలో వైద్య సేవలు మరింత మెరుగుపడటంతో పాటు,వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

ఏళ్ల నాటి సమస్యలకు చెక్… న్యాల్కల్ పీహెచ్‌సీలో రూ.16 లక్షల అభివృద్ధి పనులు పూర్తి

Article Image

న్యాల్కల్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)లో ఏళ్లుగా ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలకు పరిష్కారం లభించింది.రూ.16 లక్షల CCR నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.పీహెచ్‌సీలో దీర్ఘకాలంగా ఉన్న మరుగుదొడ్ల సమస్య,శిథిలావస్థలో ఉన్న పైకప్పు,తాగునీటి సౌకర్యం లేకపోవడం,సమావేశ భవనం కొరత వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఈ పనులు చేపట్టారు.ఉన్నతాధికారుల స్పందనతో మరుగుదొడ్ల మరమ్మతులు,పైకప్పు పునరుద్ధరణ,తాగునీటి సౌకర్యం కల్పించడం,సమావేశ భవనం నిర్మాణం పూర్తయ్యాయి.ఈ అభివృద్ధి పనులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి(DMHO)శుక్రవారం ప్రారంభించారు .దీంతో పీహెచ్‌సీలో వైద్య సేవలు మరింత మెరుగుపడటంతో పాటు,వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News