Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:41 AM

ఈదులగూడ అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ కార్యక్రమం ఘనంగా నిర్వహణ

13-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలోని ఎన్‌ఎస్‌పి క్యాంప్ ఇస్లాంపుర సెక్టార్లలో ఉన్న అశోక్ నగర్ 1-1, ఈదులగూడ అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ (Poshan Pakhwada) కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి సీడీపీఓ రేఖల మమత, 4వ వార్డు కౌన్సిలర్ పుట్టపాక శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కార్యక్రమంలో భాగంగా స్థానికంగా లభించే పోషక విలువలున్న ఆహార పదార్థాలు, ముఖ్యంగా చిరుధాన్యాలు (రాగులు, సద్దలు, జొన్నలు, కొర్రలు, సామలు, అరికెలు) ఉపయోగించి ఆరోగ్యకరమైన వంటకాల ప్రదర్శన నిర్వహించారు. తల్లులు, సంరక్షకుల మధ్య వంటల పోటీలు కూడా ఏర్పాటు చేసి, ప్రతి వంటకంలో ఉన్న పోషక విలువలను వివరించారు.

సీడీపీఓ రేఖల మమత మాట్లాడుతూ సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా పిల్లల మరియు గర్భిణీ స్త్రీల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఇంట్లోనూ ఈ విధమైన పోషకాహార వంటలను క్రమం తప్పకుండా తయారు చేయాలని తల్లులకు సూచించారు.

కౌన్సిలర్ పుట్టపాక శ్రీనివాస్ మిల్లెట్స్‌తో జావ తయారు చేసి, దాని పోషక విలువలను వివరించారు. తల్లులు మిల్లెట్స్‌తో రొట్టెలు తయారు చేసి పోటీలను విజయవంతం చేశారు. అనంతరం పోషణపై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ టి. కవిత, సూపర్వైజర్లు కె. నాగమణి, నజీమా బేగం, మహమ్మద్, అంగన్వాడీ టీచర్లు లలితమ్మ, పార్వతి, రామానుజమ్మ, రజిత, జ్యోతి, గీత, శభానా తదితరులు, తల్లులు, గర్భిణీ స్త్రీలు మరియు వార్డు పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

ఈదులగూడ అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ కార్యక్రమం ఘనంగా నిర్వహణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News