Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:06 PM

విద్యాశాఖ వైఫల్యం కలెక్టర్ ఆగ్రహం 22 మంది ఎంఈఓ లకు షోకాజు నోటీసులు

09-02-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

802 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల దరఖాస్తులు పెండింగ్

నల్గొండఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందాల్సిన ప్రీ–మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల రిజిస్ట్రేషన్‌లో జిల్లా విద్యాశాఖ ఘోర వైఫల్యం బయటపడింది. గడువు ముగిసినప్పటికీ వందలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంపై నల్గొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన 22 మంది మండల విద్యాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, వివరణ సంతృప్తికరంగా లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జిల్లాలో మొత్తం 3,122 మంది విద్యార్థుల దరఖాస్తులు జనవరి 30లోగా ఆన్లైన్‌లో అప్లోడ్ చేయాల్సి ఉండగా, కేవలం 2,320 మాత్రమే పూర్తి కావడం సంచలనంగా మారింది. ఇంకా 802 మంది విద్యార్థుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల అమలుపై ప్రశ్నార్థకంగా మారింది.గత నెల నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలోనే జనవరి 30ను తుది గడువుగా జిల్లా కలెక్టర్ స్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎంఈఓలు ఆదేశాలను పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినా, ఆలస్యంగా విషయం వెలుగులోకి రావడం గమనార్హం.చింతపల్లిలో అత్యల్ప నమోదు22 మండలాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగకపోవడం అధికార యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనంగా మారింది. ముఖ్యంగా చింతపల్లి మండలంలో అత్యల్పంగా 55.5 శాతం మాత్రమే నమోదు కావడం కలెక్టర్‌ను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసింది.

చందంపేట 56.2, తిప్పర్తి 58.5, పెద్దవూర 61.3, పీఏ పల్లి 61.5, నార్కట్‌పల్లి 65.7, దేవరకొండ 65.7, చిట్యాల 70.8 శాతం మాత్రమే పూర్తయ్యాయి.

గుండ్లపల్లి 71.2, మర్రిగూడ 72.2, గట్టుప్పల్ 73.5, నిడమనూర్ 75, అనుముల 75, చందూర్ 77, కొండమల్లేపల్లి 77.6, నాంపల్లి 79.7, కట్టంగూర్ 82.8, నకిరేకల్ 82.9, గుర్రంపోడు 85, వేములపల్లి 86.6, నల్గొండ 87.6, మిర్యాలగూడ 88.2 శాతం మాత్రమే నమోదు పూర్తి చేయడంతో సంబంధిత ఎంఈఓలకు షోకాజ్ నోటీసులు అందాయి.బాధ్యతల నిర్లక్ష్యంపై చర్యలు తప్పవువిద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన స్కాలర్‌షిప్‌ల విషయంలో ఎలాంటి అలసత్వానికీ తావులేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. తక్షణమే పెండింగ్ దరఖాస్తులను పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వివరణ ఇవ్వడంలో విఫలమైతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరికలతో జిల్లా విద్యాశాఖలో కలకలం రేగింది.

Sthanikam

విద్యాశాఖ వైఫల్యం కలెక్టర్ ఆగ్రహం 22 మంది ఎంఈఓ లకు షోకాజు నోటీసులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News