Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:42 AM

విద్యారంగ సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి మే 2–10 వరకు ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు

13-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బొమ్మలరామారం మండలంలో మే 2 నుండి 10 వరకు నిర్వహించనున్న ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు పిలుపునిచ్చారు.

సోమవారం రామన్నపేట మండలంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతుల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లావుడియ రాజు మాట్లాడుతూ “అధ్యయనం–పోరాటం” నినాదంతో విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తోందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా విద్యారంగం క్రమంగా దిగజారుతోందని, ప్రభుత్వ విద్యను కాపాడాల్సిన పాలకులే ప్రైవేటీకరణకు ప్రోత్సాహం ఇస్తున్నారని విమర్శించారు. విదేశీ పెట్టుబడులను విద్యలోకి తీసుకురావడం వల్ల విద్య వ్యాపార వస్తువుగా మారుతోందని, సామాన్యులకు అందని ద్రాక్షగా మారుతోందన్నారు.

జాతీయ విద్యా విధానం ద్వారా విద్యను కాషాయీకరణ దిశగా మళ్లిస్తూ, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు పెండింగ్‌లో ఉంచడం వల్ల విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు అవసరమైన ఖర్చులు విడుదల చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.

ఈ నేపథ్యంలో మే 2 నుండి 10 వరకు బొమ్మలరామారం మండలంలో నిర్వహించే శిక్షణ తరగతుల్లో దేశ, రాష్ట్ర రాజకీయాలు, శాస్త్రీయ ఆలోచన, విద్యారంగ సమస్యలు మరియు భవిష్యత్ పోరాటాలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలోని విద్యార్థి నాయకత్వం ఈ తరగతులకు హాజరై మార్గదర్శనం చేస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టాల ఉదయ్ కుమార్, శివ కుమార్, చరణ్, నవదీప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యారంగ సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి మే 2–10 వరకు ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News