Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:20 PM

విద్యార్థుల వార్షిక పరీక్షలపై మండల విద్యాధికారి పర్యవేక్షణ

10-04-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

శుక్రవారం సదాశివపేట మండలంలోని సూరారం, ఎల్లారం ప్రాథమికోన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న విద్యార్థుల వార్షిక పరీక్షలను మండల విద్యాధికారి ఎన్. శంకర్ పరిశీలించారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు పరీక్షలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం కచ్చితంగా నిర్వహించాలని ఆయన సూచించారు. 1 నుండి 7వ తరగతి విద్యార్థుల పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు నిర్వహించాల్సి ఉండగా, కొన్ని పాఠశాలల్లో సమయపాలన పాటించకుండా ముందుగానే ముగిస్తున్నట్లు గమనించామని తెలిపారు. ఇటువంటి విధానాలు అనుసరించకూడదని, విద్యార్థులు పరీక్షల నియమాలను తప్పనిసరిగా పాటించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష పూర్తయ్యిన వెంటనే తదుపరి రోజు వ్రాయబోయే విషయాన్ని విద్యార్థులకు బోధించాలని, విద్యార్థులను మధ్యాహ్నం 12:30 గంటల ముందు పాఠశాల నుండి పంపకూడదని, అవసరమైతే తల్లిదండ్రులు వచ్చి ప్రధానోపాధ్యాయుల అనుమతి తీసుకున్న తర్వాతనే పంపాలని తెలిపారు. అలాగే మధ్యాహ్నం 12:30కు భోజనం అందించాలని సూచించారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, నిబంధనలకు అనుగుణంగా, సమయపాలనతో సక్రమంగా నిర్వహించాలని, లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శివశంకర్, బస్వరాజు, ఉపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది అక్బర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల వార్షిక పరీక్షలపై మండల విద్యాధికారి పర్యవేక్షణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News