Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:34 PM

విద్యార్థుల ప్రోత్సాహానికి సర్పంచ్ అడుగు ముందుకు

27-01-2026 153 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

క్రమశిక్షణే విద్యార్థుల భవిష్యత్‌కు పునాది

వెల్లంకి పాఠశాలలో 340 మంది విద్యార్థులకు పెన్నుల సెట్ బహూకరణ

రామన్నపేట స్థానికం ప్రధాని ప్రతినిధి

విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలరని వెల్లంకి గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ అన్నారు. సోమవారం వెల్లంకి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దాని సాధనకు నిరంతర కృషి చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, డాక్టర్లుగా ఎదిగి తల్లిదండ్రులకు, గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా వివిధ క్రీడా పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అదేవిధంగా తమ సొంత నిధులతో 340 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.50 విలువైన పెన్నుల సెట్లను బహుకరించి విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు ప్రదర్శించిన పరేడ్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు ఎడ్ల మహేందర్ రెడ్డి, కూరేళ్ళ నరసింహాచారి, ఉప సర్పంచ్ మిర్యాల రాజకుమార్, లక్ష్మీ హ్యాండ్లూమ్స్ అధినేత తూడి మురళీధర్, ఏఏపీసీ చైర్మన్ ఉదయ రాణి, వార్డు సభ్యులు నకిరేకంటి నరేష్, గువ్వగోని మల్లమ్మ, మిర్యాల జగన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల ప్రోత్సాహానికి సర్పంచ్ అడుగు ముందుకు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News