Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:37 PM

విద్య కోసం జీతం త్యాగం – సర్పంచ్ సునీత వీరస్వామి సంచలన నిర్ణయం

27-01-2026 1,415 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జీతం మొత్తాన్ని బడికే అంకితం చేసిన సర్పంచ్

స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామ సర్పంచ్ పులిపలుపుల సునీత వీరస్వామి విద్యాభివృద్ధికి ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. తనకు వచ్చే సర్పంచ్ జీతం నుంచి ప్రతినెలా నాలుగు వేల రూపాయలను జిల్లా ఉన్నంత పాఠశాల విద్యా వాలంటీర్ గడ్డం శిరీషకు అందజేస్తానని ప్రకటించారు.

జిల్లా ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సర్పంచ్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో వాలంటీర్‌ను నియమించి, తన జీతం నుంచే వేతనం చెల్లించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండాలన్నదే తన ఆశయమని ఆమె స్పష్టం చేశారు.సర్పంచ్ తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు స్వాగతించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నీలం నరసింహ, వార్డు సభ్యులు బజ్జీరి నరసింహ, నాలుక నరసింహ, మారగోని మాధవి, నీల ఐలయ్య,బద్ద స్వరూప, రేగులగడ్డ మన్నెమ్మ, వేముల లక్ష్మీదేవి, మాజీ సర్పంచ్ బత్తుల శంకరయ్య, గ్రామ పెద్దలు జోగుల సత్యనారాయణ, మారోజు అనంతాచారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్య కోసం జీతం త్యాగం – సర్పంచ్ సునీత వీరస్వామి సంచలన నిర్ణయం

Article Image

మీ స్పందన? 11 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News