Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:53 PM

దోరేపల్లి, పగిడిమర్రి గ్రామాల్లో శీతాకాల సమావేశ శిబిరాల్లో శ్రమదానం

22-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

స్థానికం ప్రధాన ప్రతినిధి

దోరేపల్లి, పగిడిమర్రి గ్రామాల్లో నిర్వహిస్తున్న శీతాకాల సమావేశ శిబిరాల సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విస్తృతంగా శ్రమదానం చేశారు. దోరేపల్లి గ్రామంలో ఎన్ఎస్ఎస్ యూనిట్–వన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు పాఠశాల పరిసరాలు, గ్రామంలోని ప్రధాన రోడ్లపై పెరిగిన కంప చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. అలాగే మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బక్క ఎల్లమ్మ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణమే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు.అదేవిధంగా పగిడిమర్రి గ్రామంలో ఎన్ఎస్ఎస్ యూనిట్–సిక్స్ ఆధ్వర్యంలో వాలంటీర్లు గ్రామ రోడ్ల వెంట పెరిగిన కంప చెట్లను తొలగించి రహదారులను శుభ్రంగా ఉంచేందుకు శ్రమదానం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్–వన్ ప్రోగ్రాం ఆఫీసర్ నర్సింగ్ కోటయ్య, ఎన్ఎస్ఎస్ యూనిట్–సిక్స్ ప్రోగ్రాం ఆఫీసర్ కంబాలపల్లి శివరాణి, అధ్యాపకులు కె. నాగరాజు, పంచాయతీ కార్యదర్శి గణేష్, పగిడిమర్రి గ్రామ సర్పంచ్ నాగవల్లి నాగమణి, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు, బక్క రాజశేఖర్, గ్రామ ప్రజలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Sthanikam

దోరేపల్లి, పగిడిమర్రి గ్రామాల్లో శీతాకాల సమావేశ శిబిరాల్లో శ్రమదానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News