Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:34 AM

డంపింగ్ యార్డు తరలింపు ఖాయం – పేదలకు ఇళ్ల హామీ చిట్యాల 1వ వార్డులో ఎమ్మెల్యే వేముల వీరేశం

13-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 01వ వార్డు శివనేనిగూడెం గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటించి స్థానికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. డంపింగ్ యార్డు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన ఆయన, జనావాసాలకు దూరంగా డంపింగ్ యార్డును తరలించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఇళ్ల కేటాయింపులు జరగలేదని విమర్శించారు. శివనేనిగూడెంలో ఇళ్లు లేని పేద కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ, వచ్చే మార్చిలో ఈ వార్డుకు 60 ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డు గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించిన ఆయన, దీనిని తప్పకుండా మార్చుతామని స్పష్టం చేశారు.

అదేవిధంగా చెరువు పూడికతీత పనులు చేపడతామని, చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 240 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను త్వరలోనే పేదలకు కేటాయిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రకటించారు.

Sthanikam

డంపింగ్ యార్డు తరలింపు ఖాయం – పేదలకు ఇళ్ల హామీ చిట్యాల 1వ వార్డులో ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 01వ వార్డు శివనేనిగూడెం గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటించి స్థానికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. డంపింగ్ యార్డు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన ఆయన, జనావాసాలకు దూరంగా డంపింగ్ యార్డును తరలించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఇళ్ల కేటాయింపులు జరగలేదని విమర్శించారు. శివనేనిగూడెంలో ఇళ్లు లేని పేద కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ, వచ్చే మార్చిలో ఈ వార్డుకు 60 ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డు గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించిన ఆయన, దీనిని తప్పకుండా మార్చుతామని స్పష్టం చేశారు.

అదేవిధంగా చెరువు పూడికతీత పనులు చేపడతామని, చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 240 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను త్వరలోనే పేదలకు కేటాయిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రకటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News