Sthanikam - Truth Matters
Logo

డంపింగ్ యార్డ్‌లో అగ్ని ప్రమాదం – మున్సిపల్ సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది

Updated : 07 Apr 2026 02:15 IST
As Preferred Source 1 min read
డంపింగ్ యార్డ్‌లో అగ్ని ప్రమాదం – మున్సిపల్ సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది

చిట్యాల: మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు శివనేని గూడెం వద్ద గల డంపింగ్ యార్డ్‌లో సోమవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగి స్థానికుల్లో ఆందోళన కలిగించాయి. వ్యర్థాల కుప్పల్లో నుంచి ఎగిసిపడిన మంటలు కాసేపట్లోనే వ్యాపించే అవకాశముండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమై ఘటనాస్థలానికి చేరుకుని వాటర్ ట్యాంకర్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమయానికి చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్ మాట్లాడుతూ, ప్రజల భద్రతే తమకు ముఖ్యమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డంపింగ్ యార్డ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.స్థానికులు మున్సిపల్ సిబ్బంది వేగవంతమైన స్పందనను అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Sthanikam

డంపింగ్ యార్డ్‌లో అగ్ని ప్రమాదం – మున్సిపల్ సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది

Article Image

చిట్యాల: మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు శివనేని గూడెం వద్ద గల డంపింగ్ యార్డ్‌లో సోమవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగి స్థానికుల్లో ఆందోళన కలిగించాయి. వ్యర్థాల కుప్పల్లో నుంచి ఎగిసిపడిన మంటలు కాసేపట్లోనే వ్యాపించే అవకాశముండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమై ఘటనాస్థలానికి చేరుకుని వాటర్ ట్యాంకర్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమయానికి చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్ మాట్లాడుతూ, ప్రజల భద్రతే తమకు ముఖ్యమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డంపింగ్ యార్డ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.స్థానికులు మున్సిపల్ సిబ్బంది వేగవంతమైన స్పందనను అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news