Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:12 AM

డివైఎఫ్ఐ–ఐద్వా ఆధ్వర్యంలో శివాజీ నగర్‌లో ముగ్గుల పోటీలు

11-01-2026 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
శివాజీ నగర్‌లో డివైఎఫ్ఐ–ఐద్వా ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు
స్థానికం ప్రధాన ప్రతినిధి

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) మరియు ఐద్వా ఆధ్వర్యంలో శివాజీ నగర్‌లో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. మహిళల సృజనాత్మకతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముగ్గులు, క్రీడా పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. డివైఎఫ్ఐగా విద్య, ఉపాధి హక్కుల కోసం పోరాటాలు చేస్తూనే, పండుగల వేళ మహిళల ప్రతిభను వెలికి తీయడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని చెప్పారు.

యువతకు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో యూత్ డిక్లరేషన్ ప్రకటించినప్పటికీ, స్వయం ఉపాధికి 10 లక్షల వడ్డీ లేని రుణాలు, నిరుద్యోగ భృతి రూ.4,000 వంటి హామీలు రెండేళ్లు గడిచినా అమలు కాలేదని విమర్శించారు. హామీల అమలుకోసం డివైఎఫ్ఐ యువతను ఏకం చేసి ఉద్యమాలు చేపడతామని తెలిపారు.ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ మాట్లాడుతూ, మహిళా హక్కులు, రక్షణ కోసం ఐద్వా నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు అందజేశారు.

ఈ ముగ్గుల పోటీల్లో సుమారు 100 మంది మహిళలు పాల్గొనగా, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను పాండురంగ టెక్స్టైల్స్, కన్సలేషన్ సీ.కే. హాస్పిటల్ వారు అందజేశారు. కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుండాల నరేష్, బాతుక సత్తయ్య అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ సయ్యద్ హషమ్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, న్యాయవాది శ్యామ్ సుందర్, డివైఎఫ్ఐ నాయకులు రఘువరన్, గంజి రాజేష్, కుమార్, గణేష్, మహేష్, కొమ్ము నాగరాజు, ఐద్వా నాయకురాళ్లు అనురాధ, అంకిత, అనుముల జ్యోతి, సంతోష, గౌరీ, సాయి మానస, రాగం స్వాతి, గీతతో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

డివైఎఫ్ఐ–ఐద్వా ఆధ్వర్యంలో శివాజీ నగర్‌లో ముగ్గుల పోటీలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News