Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:37 AM

డీజే శబ్దాలకు నో… కఠినంగా పోలీసులు

డీజే శబ్దాలకు నో… కఠినంగా పోలీసులు

డీజే శబ్దాలకు నో… కఠినంగా పోలీసులు
13-04-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి మండలంలో శాంతి భద్రతలు, ప్రజా ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని అధిక శబ్దంతో డీజే సిస్టమ్స్ వినియోగంపై పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. శుభకార్యాలు, ర్యాలీలు, వేడుకలు, ఫంక్షన్లు వంటి కార్యక్రమాల్లో అధిక ధ్వనితో డీజేలను ఉపయోగించడం పూర్తిగా నిషేధించామని తెలిపారు. ఇకపై డీజేలకు అనుమతులు ఇవ్వడం నిలిపివేస్తామని స్పష్టం చేశారు.

అధిక శబ్దం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగడం, విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడడం, వృద్ధులు మరియు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అసౌకర్యం కలుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

చట్టాల ప్రకారం చర్యలు

పోలీసులు పేర్కొన్నట్లుగా—

Noise Pollution (Regulation and Control) Rules, 2000 ప్రకారం అనుమతించిన డెసిబెల్ స్థాయికి మించిన శబ్దం నేరంగా పరిగణించబడుతుంది.

Environment (Protection) Act, 1986 – Section 15 ప్రకారం ఉల్లంఘనలకు శిక్షలు విధిస్తారు.

IPC 268 (Public Nuisance), IPC 290 కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.

అవసరమైతే BNSS/CrPC 107, 110 ప్రకారం బైండోవర్ చర్యలు కూడా తీసుకుంటారు.

సహకరించాలి: పోలీసులు

మండల ప్రజలు, ఫంక్షన్ నిర్వాహకులు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు అందరూ సహకరించాలని కోరారు.

– జి. సుధాకర్ యాదవ్,

సబ్ ఇన్స్పెక్టర్, సోమందేపల్లి పోలీస్ స్టేషన్

Sthanikam

డీజే శబ్దాలకు నో… కఠినంగా పోలీసులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News