Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:00 PM

దశాబ్ది సాహిత్య ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన మండల విద్యాధికారి పానుగోతు సైదా నాయక్

19-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న “తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్–2026” దశాబ్ది సాహిత్య ఉత్సవాల పోస్టర్‌ను చిట్యాల మండల విద్యాధికారి పానుగోతు సైదా నాయక్ ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు ఈనెల 21, 22 తేదీలలో హైదరాబాద్లో జరగనున్నాయి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహిత్యం సమాజ మార్పుకు మార్గదర్శకమని పేర్కొన్నారు. లిటరరీ ఫెస్ట్‌లో కవిత్వం, కథ, నవల, విమర్శలపై విశ్లేషణలతో పాటు మహిళా, యువ సాహిత్యంపై ప్రత్యేక చర్చలు, పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనాలు, ఫోటో ఎగ్జిబిషన్‌లు, పుస్తక ప్రదర్శనలు, పాటలు, నాటక ప్రదర్శనలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

జిల్లా తెలంగాణ సాహితి అధ్యక్షులు కుకుడాల గోవర్ధన్ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులకు “డ్రగ్స్ రహిత సమాజం – సుస్థిర భవిష్యత్తు” అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించామని తెలిపారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు రెండు ప్రోత్సాహక బహుమతులు హైదరాబాద్‌లో జరిగే ఉత్సవాల్లో అందజేయనున్నట్లు చెప్పారు.

జిల్లాలోని సీనియర్ కవులు, రచయితలు,సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.కార్యక్రమంలో చిట్యాల ప్రమోద సాహితీ ప్రధాన కార్యదర్శి తాడూరి చంద్రం, ప్రధానోపాధ్యాయులు అంబటి సత్తయ్య, బాదం బిక్షపతి, కరుణాకర్, వెంకటేశ్వర్లు, జాన్ వరలక్ష్మి, సరిత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దశాబ్ది సాహిత్య ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన మండల విద్యాధికారి పానుగోతు సైదా నాయక్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News