Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:22 AM

డంపింగ్ యార్డు తరలింపు డిమాండ్‌కు బలమైన మద్దతు… గ్రామస్థుల నిరసనకు సంఘీభావం తెలిపిన చిరుమర్తి లింగయ్య

02-01-2026 261 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల స్థానిక ప్రతినిధి కొమ్మిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీ :

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం వార్డులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని కోరుతూ గ్రామస్థులు చేపట్టిన నిరసనకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మద్దతు ప్రకటించారు. స్థానికుల ఆందోళనకు సంఘీభావంగా నిరసన కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలను దగ్గరగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, నివాస ప్రాంతాలకు సమీపంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. దుర్వాసన, వ్యర్థాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని డంపింగ్ యార్డును ప్రత్యామ్నాయ ప్రాంతానికి తరలించేలా మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు గ్రామస్థులతో కలిసి పోరాడుతామని భరోసా ఇచ్చారు

Sthanikam

డంపింగ్ యార్డు తరలింపు డిమాండ్‌కు బలమైన మద్దతు… గ్రామస్థుల నిరసనకు సంఘీభావం తెలిపిన చిరుమర్తి లింగయ్య

Article Image
చిట్యాల స్థానిక ప్రతినిధి కొమ్మిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీ :

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం వార్డులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని కోరుతూ గ్రామస్థులు చేపట్టిన నిరసనకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మద్దతు ప్రకటించారు. స్థానికుల ఆందోళనకు సంఘీభావంగా నిరసన కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలను దగ్గరగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, నివాస ప్రాంతాలకు సమీపంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. దుర్వాసన, వ్యర్థాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని డంపింగ్ యార్డును ప్రత్యామ్నాయ ప్రాంతానికి తరలించేలా మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు గ్రామస్థులతో కలిసి పోరాడుతామని భరోసా ఇచ్చారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News