Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:51 AM

CPI శత వసంతాల వేడుకలను జయప్రదం చేద్దాం

CPI శత వసంతాల వేడుకలను జయప్రదం చేద్దాం

CPI శత వసంతాల వేడుకలను జయప్రదం చేద్దాం
January 16, 2026 12:43 PM 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ నెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఘనంగా నిర్వహించనున్న శత వసంతాల వేడుకలను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ చారిత్రక కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగనాథ్ హళ్లి గ్రామంలో సీపీఐ పార్టీ పతాకాన్ని గ్రామ కార్యదర్శి సిద్దలింగ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. సుదర్శన్, మండల కార్యదర్శి కల్లుబావిరాజు పాల్గొని ప్రసంగించారు.

వక్తలు మాట్లాడుతూ, 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో ఆవిర్భవించిన సీపీఐ పార్టీకి నేటికి వందేళ్లు నిండాయని గుర్తు చేశారు. భారతదేశ సంపూర్ణ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలకులపై అలుపెరగని పోరాటాలు సాగించిన ఘన చరిత్ర సీపీఐకే దక్కిందన్నారు. ప్రతి పేదవాడికి సాగు భూమి ఉండాలన్న లక్ష్యంతో పెత్తందారులపై పోరాటాలు చేసి భూ పంపిణీకి బాటలు వేసిన పార్టీగా సీపీఐ నిలిచిందని పేర్కొన్నారు.స్వాతంత్ర్య ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నాయకులు ప్రజల మధ్య మత ఘర్షణలు రెచ్చగొడుతూ దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాలపై దాడులకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. గ్రామాల్లో ఉపాధి లేక, తిండి దొరకని పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువును వదిలి తట్టా–పుట్ట సర్దుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

2005లో కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా అమలులోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి కొత్త పథకాలను తెచ్చి ఉపాధి కార్మికుల కడుపులు కొడుతోందని ఆరోపించారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా గ్రామాల్లో ఇంటి స్థలాలుకేటాయించకపోవడం విడ్డూరమని అన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని, గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు శ్రీనివాసులు, గాదిలింగ, వెంకటేశులు, కారెప్ప తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ శత వసంతాల వేడుకలు ప్రజా సమస్యల పరిష్కారానికి మరో మైలురాయిగా నిలవాలని నాయకులు ఆకాంక్షించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News