Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:29 AM

చౌటుప్పల్ మున్సిపాలిటీ నామినేషన్ల పరిశీలన

29-01-2026 375 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి కత్తుల రవి

యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భాస్కర్ రావు ఈరోజు చౌటుప్పల్ పురపాలక సంఘం కార్యాలయంలో జరుగుతున్న ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డి తో కలిసి స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించి, హెల్ప్ డెస్క్, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను, క్షుణ్ణంగా పరిశీలించారు.ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం నామినేషన్ల స్వీకరణ జరుగుతుందో లేదో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నామినేషన్ పత్రాన్ని నిశితంగా పరిశీలించాలని సూచించారు.నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును సమీక్షించారు. నామినేషన్ ప్రక్రియ మొత్తం జాగ్రత్తగా చేయాలని, ఎక్కడా జాప్యం జరగకుండా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్, గుత్తా వెంకట్రాంరెడ్డి, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ అధికారి అంజయ్య, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీ నామినేషన్ల పరిశీలన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News