Sthanikam - Truth Matters
Logo

చౌటుప్పల్ లొ రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన కార్యక్రమం

Updated : 24 Jan 2026 14:25 IST
As Preferred Source 1 min read
చౌటుప్పల్ లొ రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన కార్యక్రమం

స్థానికం ప్రతినిధి కోమిడాల మహేందర్ రెడ్డి

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారు, సీటు బెల్టు లేకుండా కార్లు నడిపే వాహనదారుల్లో మార్పు తీసుకొచ్చేలా చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో విద్యార్థుల చేత పువ్వులు ఇప్పిస్తూ వాహనదారులను చైతన్యపరిచారు.

ఈ సందర్భంగా సీఐ మన్మధకుమార్ మాట్లాడుతూ, చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తోందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల చేత పువ్వులు అందజేయడం ద్వారా వాహనదారుల మనసులను తాకే ప్రయత్నం చేయడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు.

ప్రజల ప్రాణాల పట్ల ఇంతటి శ్రద్ధ చూపుతున్న సీఐ మన్మధకుమార్ లాంటి అధికారులు ఎందరికో ఆదర్శమని పలువురు ప్రశంసించారు. అదే సమయంలో రోడ్లపై గుంతలు, అధ్వాన్నమైన రహదారులపై కూడా పాలకులు, సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరారు. ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతున్న రోడ్ల పరిస్థితులపై కూడా ఇదే తరహా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడ్డారు.

రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరి భాగస్వామ్యంతోనే ప్రమాదాలను తగ్గించవచ్చని ఈ కార్యక్రమం స్పష్టంగా చాటిచెప్పిందని స్థానికులు తెలిపారు.

Sthanikam

చౌటుప్పల్ లొ రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన కార్యక్రమం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news