Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:37 AM

చిట్యాలలో రూ.2 కోట్ల మార్కెట్ పనులు నిలిపివేతపై కాంగ్రెస్‌పై చిరుమర్తి లింగయ్య ధ్వజం

12-01-2026 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ జిల్లా:

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.2 కోట్ల వ్యయంతో మంజూరైన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.2 కోట్లతో మార్కెట్ నిర్మాణ పనులను ప్రారంభించామని తెలిపారు. అన్ని అనుమతులు, మంజూర్లు అప్పుడే పూర్తయ్యాయని, పనులు కూడా ప్రారంభ దశలో ఉన్నాయని గుర్తు చేశారు.అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్మాణ పనులను నిలిపివేసిందని ఆరోపించారు. అలసత్వం, నిర్లక్ష్యం, చేతకాని తనంతో అభివృద్ధి పనులను అడ్డుకుంటూ పట్టణ పురోగతిని వెనక్కి నెట్టేస్తోందని విమర్శించారు.చిట్యాల పట్టణాన్ని మున్సిపాలిటీగా సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తమ హయాంలో అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశామని, అందులో భాగంగానే ప్రజలకు అవసరమైన సౌకర్యాలతో కూడిన సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌కు రూ.2 కోట్లు కేటాయించామని చెప్పారు.తాము చేపట్టిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేసి, ఇప్పటికే మంజూరై ప్రారంభమైన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేయడం కాంగ్రెస్ నాయకుల ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.ప్రస్తుత ఎమ్మెల్యే ఇప్పటివరకు పట్టణ అభివృద్ధిపై ఒక్క సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదని, ఆయనకు ఈ ప్రాంతంపై ఎంత చిత్తశుద్ధి ఉందో పురవాసులే ఆలోచించాలని వ్యాఖ్యానించారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మార్కెట్ యార్డు కాంప్లెక్స్ నిర్మాణానికి సుమారు కోటిన్నర నిధులు మంజూరు చేసి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పనులు పూర్తిచేశామని తెలిపారు. ఆ కాంప్లెక్స్ శిలాఫలకాన్ని తొలగించి కొత్త శిలాఫలకంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడం సిగ్గుచేటని అన్నారు.గత రెండేళ్లలో పట్టణ అభివృద్ధికి ప్రస్తుత ఎమ్మెల్యే చేసిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు అక్రమ దందాలకు పాల్పడుతూ, సంక్షేమ పథకాల అమల్లో అడ్డంకులు సృష్టించి పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.సూట్‌కేసులు, డబ్బు సంచులతో తిరుగుతూ ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలను కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని విమర్శించారు. పట్టణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆలోచించి ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

Sthanikam

చిట్యాలలో రూ.2 కోట్ల మార్కెట్ పనులు నిలిపివేతపై కాంగ్రెస్‌పై చిరుమర్తి లింగయ్య ధ్వజం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News