Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:14 AM

చిట్యాల మున్సిపాలిటీలో 12 వార్డులకు PRPS అభ్యర్థుల పోటీ – నూనె వెంకట్ స్వామి వెల్లడిబహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బి.ఎల్.ఎఫ్.) బలపరిచిన ప్రజా పోరాట సమితి (PRPS

11-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల స్థానికం ప్రధాన ప్రతినిధి

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బి.ఎల్.ఎఫ్.) బలపరిచిన ప్రజా పోరాట సమితి (PRPS) అభ్యర్థులు చిట్యాల మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డులకు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నట్లు PRPS రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి ప్రకటించారు. ఈ మేరకు చిట్యాలలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, తెలంగాణను తొమ్మిదేళ్లు పాలించిన బిఆర్ఎస్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమవడం, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తూ దేశంలో మత ఉద్రిక్తతలను పెంచి పోషిస్తున్న బీజేపీ విధానాలను ప్రజలు తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పార్టీలను బలపరిచే సీపీఎం, సీపీఐలను కూడా ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని కోరారు.అంబేద్కరిజం, మార్క్సిజం ప్రాతిపదికన సాగుతున్న ఈ పోరాటంలో భాగంగా బహుజన రాజ్యాధికార లక్ష్యంతో PRPS అభ్యర్థులను గెలిపించాలని నూనె వెంకట్ స్వామి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టణ కార్మిక వర్గాన్ని, గ్రామీణ ఉపాధి కూలీలను అణచివేస్తూ మత విద్వేషాలనురెచ్చగొడుతోందని విమర్శించారు. అవినీతి, అధికార దుర్వినియోగానికి ప్రతీకలుగా మారిన కాంగ్రెస్, బిఆర్ఎస్‌లకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు.ఈ సమావేశానికి ఉయ్యాల లింగస్వామి గౌడ్ అధ్యక్షత వహించగా, నాగిళ్ల యాదయ్య, బర్రె సంజీవ, జిట్ట వెంకన్న, జిట్టా ఉమాశంకర్, దామనూరి కృష్ణ, మిరియాల వెంకటేశం నేత, వల్లమల్ల యాదగిరి, నీల యాదగిరి యాదవ్, గుణగంటి సత్తయ్య గౌడ్, బైరు వెంకన్న గౌడ్, మారుగోని వెంకన్న గౌడ్, శీలోజు వీరప్ప చారి, దాచేపల్లి సంతోష్ గుప్తా, ఏనుగు నరసింహారెడ్డి, గాదె శ్రీహరి, గాదే ఎల్లేష్, కొండే శివ, కొండే నరేష్, ఉండ్రాతి కృష్ణ కుర్రు, ఎస్.కె. నజీర్ భాష, ఎస్.కె. జమాల్, పురం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీలో 12 వార్డులకు PRPS అభ్యర్థుల పోటీ – నూనె వెంకట్ స్వామి వెల్లడిబహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బి.ఎల్.ఎఫ్.) బలపరిచిన ప్రజా పోరాట సమితి (PRPS

Article Image
చిట్యాల స్థానికం ప్రధాన ప్రతినిధి

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బి.ఎల్.ఎఫ్.) బలపరిచిన ప్రజా పోరాట సమితి (PRPS) అభ్యర్థులు చిట్యాల మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డులకు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నట్లు PRPS రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి ప్రకటించారు. ఈ మేరకు చిట్యాలలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, తెలంగాణను తొమ్మిదేళ్లు పాలించిన బిఆర్ఎస్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమవడం, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తూ దేశంలో మత ఉద్రిక్తతలను పెంచి పోషిస్తున్న బీజేపీ విధానాలను ప్రజలు తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పార్టీలను బలపరిచే సీపీఎం, సీపీఐలను కూడా ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని కోరారు.అంబేద్కరిజం, మార్క్సిజం ప్రాతిపదికన సాగుతున్న ఈ పోరాటంలో భాగంగా బహుజన రాజ్యాధికార లక్ష్యంతో PRPS అభ్యర్థులను గెలిపించాలని నూనె వెంకట్ స్వామి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టణ కార్మిక వర్గాన్ని, గ్రామీణ ఉపాధి కూలీలను అణచివేస్తూ మత విద్వేషాలనురెచ్చగొడుతోందని విమర్శించారు. అవినీతి, అధికార దుర్వినియోగానికి ప్రతీకలుగా మారిన కాంగ్రెస్, బిఆర్ఎస్‌లకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు.ఈ సమావేశానికి ఉయ్యాల లింగస్వామి గౌడ్ అధ్యక్షత వహించగా, నాగిళ్ల యాదయ్య, బర్రె సంజీవ, జిట్ట వెంకన్న, జిట్టా ఉమాశంకర్, దామనూరి కృష్ణ, మిరియాల వెంకటేశం నేత, వల్లమల్ల యాదగిరి, నీల యాదగిరి యాదవ్, గుణగంటి సత్తయ్య గౌడ్, బైరు వెంకన్న గౌడ్, మారుగోని వెంకన్న గౌడ్, శీలోజు వీరప్ప చారి, దాచేపల్లి సంతోష్ గుప్తా, ఏనుగు నరసింహారెడ్డి, గాదె శ్రీహరి, గాదే ఎల్లేష్, కొండే శివ, కొండే నరేష్, ఉండ్రాతి కృష్ణ కుర్రు, ఎస్.కె. నజీర్ భాష, ఎస్.కె. జమాల్, పురం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News