Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:33 PM

చిట్యాలమున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యే వేముల వీరేశం విస్తృత ప్రచారం

04-02-2026 150 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం:

నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం విస్తృత ప్రచారం జరిపారు. 02వ వార్డు అభ్యర్థి జడల పూలమ్మ–మల్లయ్య, 09వ వార్డు అభ్యర్థి ఏర్పుల పరమేష్, 10వ వార్డు అభ్యర్థి సిలువేరు మౌనిక–శేఖర్‌లకు ప్రజలు చేయి గుర్తుకు ఓటు వేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ, 02వ వార్డులో అనేక మౌలిక సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతిజ్ఞాబద్ధంగా పని చేస్తుందని తెలిపారు. ఇండ్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు జరుగుతుందని, డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని గుర్తుచేశారు.తన తొలి దశలోనే 3,500 ఇండ్లను మంజూరు చేసి ప్రతి గ్రామానికి అందించినట్లు చెప్పారు. 2014–2018 మధ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చిట్యాల పట్టణంలో 240 ఇండ్ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశాయని విమర్శిస్తూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పని చేస్తామని హామీ ఇచ్చారు.

Sthanikam

చిట్యాలమున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యే వేముల వీరేశం విస్తృత ప్రచారం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News