Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:11 PM

చిట్యాలలో ఉత్సాహంగా కామదహనం, రేపు హోలీ సంబరాలకు సిద్ధం

02-03-2026 310 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పురపాలక పరిధిలో సోమవారం కామదహనం కార్యక్రమాలు భక్తి, శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించనున్నారు. మంగళవారం జరగనున్న హోలీ పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామదహనం అనేది చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌహార్ద్రం, సోదరభావం పెంపొందించే పండుగగా హోలీకి ప్రత్యేక స్థానం ఉందన్నారు. రంగుల పండుగను పరస్పర గౌరవంతో, ఎలాంటి అపశృతి లేకుండా జరుపుకోవాలని సూచించారు.పురపాలక ప్రాంత ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ పద్ధతుల్లో పండుగను నిర్వహించాలని, యువత ప్రత్యేకంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. భక్తి, ఆనందాల మధ్య హోలీ సంబరాలు చిట్యాలలో మరింత వైభవంగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ధూప దీప నైవేద్యాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నగర ప్రజలు సామాజిక ఐక్యతను చాటుతూ పండుగను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

చిట్యాలలో ఉత్సాహంగా కామదహనం, రేపు హోలీ సంబరాలకు సిద్ధం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News