Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:07 PM

చిట్యాలలో రాత్రి రోడ్డు ప్రమాదం – బైకర్ తీవ్ర గాయాలు

20-03-2026 160 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని భువనగిరి రోడ్డులో ఉన్న భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన నితిన్ అనే యువకుడు రామన్నపేట నుండి చిట్యాల వైపు తన వాహనంపై వస్తున్నాడు.

ఈ క్రమంలో భువనగిరి రోడ్డులో ఎదురుగా వస్తున్న మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన డీసీఎం వాహనం నితిన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నితిన్ గాయపడ్డాడు.

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన నితిన్‌ను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Sthanikam

చిట్యాలలో రాత్రి రోడ్డు ప్రమాదం – బైకర్ తీవ్ర గాయాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News