Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:08 PM

చిట్యాలలో కౌన్సిలర్ శ్రీనివాస్ కు ఘన సన్మానం

19-02-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా విజయం సాధించిన నిమ్మనగోటి శ్రీనివాస్‌కు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగం, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏరుకొండల వెంకటేశం, ఇతర సంఘం నాయకులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ సంఘం ప్రతినిధులు, రాజకీయ రంగంలో కుమ్మరుల ప్రాతినిధ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధి కోసం ఎన్నికైన ప్రజాప్రతినిధులు కృషి చేయాలని, సామాజిక ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కౌన్సిలర్ శ్రీనివాస్ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, పట్టణాభివృద్ధితో పాటు కుమ్మరుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కుమ్మర సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాలలో కౌన్సిలర్ శ్రీనివాస్ కు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News