Sthanikam - Truth Matters
Logo

చిట్యాల వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు స్వయం విక్రయ వేదిక దళారుల మోసాలకు చెక్

Updated : 13 Mar 2026 11:21 IST
As Preferred Source 1 min read
చిట్యాల వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు స్వయం విక్రయ వేదిక దళారుల మోసాలకు చెక్

చిట్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు ఉపయోగపడే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణానికి చెందిన రావుల వెంకట రెడ్డి తన రిటైల్ కూరగాయల దుకాణంలో రైతులు స్వయంగా పండించిన కూరగాయలను నేరుగా తీసుకొచ్చి అమ్ముకునే సౌకర్యాన్ని కల్పించారు.సాధారణంగా రైతులు తమ పంటలను దళారుల ద్వారా అమ్మాల్సి రావడంతో సరైన ధర లభించక మోసపోతున్న సందర్భాలు తరచూ కనిపిస్తున్నాయి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని రైతులకు నేరుగా వినియోగదారులకు అమ్ముకునే అవకాశాన్ని ఇవ్వాలని రావుల వెంకట రెడ్డి ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు.

రైతులు తమ పొలాల్లో పండించిన తాజా కూరగాయలను చిట్యాల కూరగాయల మార్కెట్‌కు తీసుకువచ్చి, ఆ దుకాణంలో ఏర్పాటు చేసిన స్థలంలో స్వయంగా అమ్ముకోవచ్చు. దీంతో మధ్యవర్తులు లేకుండా రైతులకు మంచి ధర లభించడంతో పాటు వినియోగదారులకు కూడా నాణ్యమైన కూరగాయలు అందుబాటులోకి వస్తాయని స్థానికులుఅభిప్రాయపడుతున్నారు.కూరగాయలు పండించే రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని దళారుల వద్దకు వెళ్లి నష్టపోకుండా, నేరుగా తమ పంటలను అమ్ముకోవాలని రావుల వెంకట రెడ్డి కోరారు. స్థానికంగా ఈ ప్రయత్నం రైతులకు మేలు చేసే విధంగా ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు.

Sthanikam

చిట్యాల వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు స్వయం విక్రయ వేదిక దళారుల మోసాలకు చెక్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి