చిట్యాల మున్సిపాలిటీలో నాలుగు కో-ఆప్షన్ సభ్యుల పదవుల కోసం పోటీ ఉత్కంఠగా మారింది. ఇందులో రెండు స్థానాలు మైనారిటీలకు, రెండు స్పెషల్ నాలెడ్జ్ వర్గానికి కేటాయించగా, ఒకటి మహిళకు ఇవ్వాల్సి ఉంది. దాదాపు 8–10 మంది ఆశావహులు రంగంలోకి దిగగా, పార్టీ పెద్దల వద్ద పైరవీలు జోరుగా సాగుతున్నాయి.
ఈనెల 16న నోటిఫికేషన్ వెలువడగా, నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. స్క్రుటినీ అనంతరం కౌన్సిల్ సమావేశంలో ఓటింగ్ జరగనుంది. కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్న ఈ మున్సిపాలిటీలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం మద్దతే కో-ఆప్షన్ ఎంపికలో కీలకంగా మారింది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి