Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:05 PM

చిట్యాల మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

23-02-2026 237 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్వంత నిధులతో పనులు చేపట్టిన వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ – ప్రజల ప్రశంసలు

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డు సంజీవ్ నగర్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ ముందడుగు వేసి సమస్య నివారణకు చర్యలు చేపట్టారు.

మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది సహకారంతో యంత్రాల ద్వారా మురుగు కాల్వలను శుభ్రపరిచారు. సెప్టిక్ ట్యాంకర్ ద్వారా నిల్వైన మురుగునీటిని పూర్తిగా తొలగించడంతో ప్రాంతంలో నెలకొన్న దుర్వాసన, దోమల సమస్యలు తగ్గుముఖం పట్టాయి. ఈ పనులను కౌన్సిలర్ స్వంత నిధులతో నిర్వహించడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా కుక్కల మోహన్ మాట్లాడుతూ, వార్డులో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సమస్యల రహితంగా, పరిశుభ్రమైన వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.సమస్య పరిష్కారానికి స్వయంగా నిధులు వెచ్చించి పనులు చేయించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై స్పందించే ప్రజాప్రతినిధులు అవసరమని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శేపూరి యాదయ్య, పాల సహకార సంఘం చైర్మన్ జిట్టా రవి, అమరోజు మదన్, బోయ సురేష్, జిట్ట సాయి, జిట్ట కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News