Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 06:28 PM

చిన్నారిపై అత్యాచారం… రాజీ లేని శిక్ష అవసరం. జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్

14-01-2026 238 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి:స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పెంచికల్ పహాడ్‌లో ఐదేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి కఠిన శిక్షతో పాటు ఉరి శిక్ష విధించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

అభం శుభం తెలియని పసిపిల్లలను చాక్లెట్లు, బిస్కెట్లు ఆశచూపి నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడం, అత్యాచారాలకు పాల్పడటం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై పాక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, 12 ఏళ్ల లోపు పిల్లలపై అత్యాచారం చేసిన వారికి ఉరి శిక్ష విధించాలన్న సుప్రీంకోర్టు తీర్పును కఠినంగా అమలు చేయాలని కోరారు.డాక్టర్ నివేదిక ఆధారంగా శిక్ష విధించాలని, సాక్ష్యాల లోపాల పేరిట నిందితులు తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదని అన్నారు. మంగళవారం అత్యాచారానికి గురై జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న ఆయన, చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. బాలల హక్కుల పరిరక్షణ వేదిక బాలిక తల్లిదండ్రులకు అండగా ఉంటుందని తెలిపారు.చిన్నారి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Sthanikam

చిన్నారిపై అత్యాచారం… రాజీ లేని శిక్ష అవసరం. జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News