Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:21 PM

చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి కేంద్రాలే : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

20-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదగిరిగుట్ట, స్థానికం ప్రధాన ప్రతినిధి

అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యకు పునాదిగా నిలుస్తాయని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం నూతన అంగన్వాడి భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

మంగళవారం యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో సైదాపురం–1, సైదాపురం–2 అంగన్వాడి కేంద్రాలకు నూతనంగా నిర్మించిన భవనాలను మంత్రి ప్రారంభించారు. ఎస్‌డీఎఫ్, డీఎంఎఫ్ నిధులతో ఒక్కొక్క కేంద్రానికి రూ.15 లక్షల చొప్పున ఈ భవనాలు నిర్మించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ నూతన అంగన్వాడి భవనాల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, అంగన్వాడి వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమన్నారు.

అనంతరం నూతనంగా నిర్మించిన అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి చిన్నారులతో ముచ్చటించి, వారి సంక్షేమ వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అంగన్వాడి సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి కేంద్రాలే : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News