Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

చిన్నకాపర్తి రైతులకు ఊరట.

చిన్నకాపర్తి రైతులకు ఊరట.

చిన్నకాపర్తి రైతులకు ఊరట.
11-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

.ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రహదారి సమస్యకు పరిష్కారం.

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నెలకొన్న రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారం అందించగా, స్థానిక సర్పంచ్ మరియు రైతుల చొరవ కీలకంగా మారింది.

కొనుగోలు కేంద్రం సమీపంలో భూమి కలిగిన రైతు ముక్కామల్ల యాదయ్య, లారీలు మరియు ట్రాక్టర్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా తన భూమి గుండా దారి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. రహదారి విస్తరణలో అడ్డుగా ఉన్న తాటి చెట్లను జేసీబీ సహాయంతో తొలగించారు.ఈ పనులను చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్ మరియు రైతు యాదయ్య స్వయంగా పర్యవేక్షించి పూర్తి చేయించారు. రహదారి సమస్య పరిష్కారంతో ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాకపోకలు సులభతరమయ్యాయి.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిన్నకాపర్తి రైతులకు ఊరట.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News