Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:17 PM

చౌటుప్పల్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

చౌటుప్పల్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

చౌటుప్పల్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
11-04-2026 165 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆందోల్ మైసమ్మ ఆలయం వద్ద గత కొంతకాలంగా భిక్షాటన చేసుకుంటున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి (సుమారు 45-50 ఏళ్లు) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.​పోలీసుల కథనం ప్రకారం:ఆందోల్ మైసమ్మ ఆలయ జూనియర్ అసిస్టెంట్ అలుగుబెల్లి సత్తిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్ అనే వ్యక్తి గత 15 ఏళ్లుగా మల్కాపురంలో కాగితాలు, ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుంటూ, గత మూడేళ్లుగా ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. తనకు ఎవరూ లేరని గతంలో అతను స్థానికులకు తెలిపాడు. ​శనివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆలయం పక్కనే ఉన్న కిరాణా షాపు హాల్‌లో శంకర్ అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది, పరిశీలించగా అతను అప్పటికే మృతి చెంది ఉన్నాడు. తీవ్రమైన ఎండలు, అనారోగ్యం, సరైన ఆహారం లేక ఆరోగ్యం క్షీణించి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ప్రైవేటు అంబులెన్స్ ద్వారా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.​గుర్తు పట్టేందుకు వయస్సు: 45 నుండి 50 ఏళ్ల మధ్య.​ఎత్తు: సుమారు 5.5 అడుగులు.​రంగు: చామన ఛాయ.​జుట్టు: నలుపు, తెలుపు రంగులో ఉంది.​దుస్తులు: పింక్ కలర్ చొక్కా, బ్లూ కలర్ గ్రీన్ లైన్స్ ఉన్న లుంగీ ధరించి ఉన్నాడు.

​మృతుని వివరాలు తెలిసిన వారు చౌటుప్పల్ పోలీసు స్టేషన్‌లో లేదా ఎస్‌ఐ ఉపేందర్ రెడ్డి (సెల్: 8712553699) నంబర్‌కు సమాచారం అందించాలని ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Sthanikam

చౌటుప్పల్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News