Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:30 AM

చమురు నిల్వల కోసమే వెనిజులపై అమెరికా దౌర్జన్యం: సిపిఎం

08-01-2026 156 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెనిజుల అధ్యక్షుడి అక్రమ నిర్బంధాన్ని ఖండిస్తూ సుభాష్ సెంటర్‌లో సిపిఎం నిరసన

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

వెనిజుల దేశంపై సామ్రాజ్యవాద అమెరికా ఆధిపత్యాన్ని ప్రజలంతా ముక్తకంఠంగా ఖండించాలని సిపిఎం జిల్లా నాయకులు మేక అశోక్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు. వెనిజుల అధ్యక్షుడు నికోలాస్ మధురో, ఆయన భార్యను అమెరికా దళాలు అక్రమంగా తమ దేశానికి తరలించి నిర్బంధించడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వెనిజులలో ఉన్న అపారమైన చమురు నిక్షేపాలపై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కుతూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఆయుధ సంపత్తితో అనేక దేశాలను బెదిరిస్తూ యుద్ధాలను సృష్టించి ప్రపంచాన్ని అశాంతికి గురిచేస్తోందని ఆరోపించారు.భారత సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ట్రంప్ వ్యవహరిస్తున్నా, విశ్వగురు అని చెప్పుకునే ప్రధాని మోడీ మౌనంగా ఉండడం సరికాదని అన్నారు. అమెరికా నిరంకుశ సామ్రాజ్యవాద విధానాలను భారత ప్రభుత్వం బహిరంగంగా వ్యతిరేకించాలని, లేదంటే భవిష్యత్తులో దేశానికి నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల కార్యదర్శివర్గ సభ్యులు కందుల హనుమంతు, కల్లూరి నగేష్, మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు, బావండ్లపల్లి బాలరాజు, నాగటి ఉపేందర్, నీల అయిలయ్య, వేముల సైదులు, ఆవనగంటి నగేష్, మేడి గణేష్, సర్పంచ్ గట్టు నర్సింహా, శాఖ కార్యదర్శి మునికుంట్ల లెనిన్, ఉప సర్పంచ్ పావిరాల మత్స్యగిరి, మెట్టు శ్రవణ్ కుమార్, పల్లె సత్యం, ఆవనగంటి స్వామి, వెంకటేష్, మోటే స్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చమురు నిల్వల కోసమే వెనిజులపై అమెరికా దౌర్జన్యం: సిపిఎం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News